టాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి మనందరికీ తెలిసిందే.నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు బండ్ల గణేష్.
ఇది ఇలా ఉంటే బండ్ల గణేష్ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎఫ్ఎన్ సిసి కీ జరగబోయే ఎన్నికలలో వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయబోతున్నట్లు ఇటీవలే బండ్ల గణేష్ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.అంతేకాకుండా ఓటు వేసి గెలిపించండి అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు బండ్లన్న.
కాగా వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయబోతున్న బండ్లన్న బాగానే హడావిడి చేస్తున్నాడు.
ఇప్పటికే సందడిని కూడా మొదలుపెట్టేసారు బండ్ల గణేష్ అభిమానులు.
ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ కి సంబంధించిన భారీ కటౌట్ లను ఏర్పాటు చేశారు.బండ గణేష్ తో పాటు మిగతా సభ్యులు కూడా పెద్దపెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇలా చిన్న చిన్న విషయాలకే హడావిడి చేయడం అన్నది మామూలుగా జరుగుతూనే ఉంటుంది.ఇటీవల ముగిసిన మా ఎన్నికల విషయంలో కూడా ఇలాగే జరిగింది.
మా ఎన్నికలు ఏకంగా రాష్ట్ర ఎన్నికలను తలపించాయి.ఈ ఎఫ్ఎన్ సిసి ఎలెక్షన్స్ కోసం ఇప్పటికె కటౌట్స్, ఫ్లెక్సీ లతో ఫిలింనగర్ మొత్తం కట్టేసారు.

మా ఎలెక్షన్స్ లో కొద్దిగా మిస్ అయిన బండ్ల గణేష్ ఈసారి జరగబోయే ఎఫ్ఎన్ సిసి లో ఇలా అయిన వైస్ ప్రెసిడెంట్ గా గెలవాలి అని గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంలో బండ్ల గణేష్ అభిమానులు మరింత యాక్టివ్ గా పాల్గొంటూ బండ్లన్నకు ఓటు వేయాలి అంటూ భారీ కటౌట్స్ ని ఏర్పాటు చేశారు.కాగా నేడు ఎఫ్ ఎన్ సి సి ఎలక్షన్స్ జరగనున్న విషయం తెలిసిందే.ఈరోజుతో ఎవరు వైస్ ప్రెసిడెంట్ గా గెలవనన్నారు అన్న విషయం కూడా తేలనుంది.
అయితే ఈ పోటీలలో ఎఫ్ఎన్ సీసీ ఎలా అయినా బండ్ల గణేష్ గెలుస్తారు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.







