తెలుగు తల్లి కన్నీళ్లు పెడుతుంది.. ఎన్టీఆర్ యూనివర్సిటీ పై దర్శకేంద్రుడు ఎమోషనల్!

స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరును తొలగించడంతో పెద్ద ఎత్తున నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ అధికార ప్రభుత్వం పై మండిపడుతున్నారు.ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు నేతలు పూర్తిగా తప్పుపడుతున్నారు.

 Telugu Mother Sheds Tears Director Ntr Is Emotional On University Telugu Mother-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ విషయంపై ఎంతోమంది స్పందిస్తూ ఎన్టీఆర్ పేరు మార్చడం చాలా సిగ్గుచేటు అంటూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇప్పటికే ఈ విషయంపై ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బాలకృష్ణ వంటి పలువురు స్పందించారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం పట్ల పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పందించారు.ఈ క్రమంలోనే దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఈ విషయంపై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ట్విట్టర్ వేదికగా రాఘవేంద్రరావు స్పందిస్తూ.తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు.

ఆయన పేరుతో ఉన్న యూనివర్సిటీకి పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Telugu Ap, Ntr, Raghavendra Rao, Telugumother-Movie

ఈ విధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైయస్ఆర్ పేరు పెట్టడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే రాఘవేంద్రరావు ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ విషయంపై ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వల్ల పెద్ద ఎత్తున నందమూరి అభిమానులు తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు.

మరి ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా.లేక ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube