ఇటీవలే బాలీవుడ్ నుండి మరొక పెద్ద సినిమా బ్రహ్మాస్త్ర రిలీజ్ అయ్యింది.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా నటించారు.
బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ విలన్ గా కనిపించింది.అలాగే అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమా మూడు పార్టులుగా వస్తుంది అని ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో మొదటి పార్ట్ పూర్తి అవడంతో రిజల్ట్ తో సంబంధం లేకుండా సెకండ్ పార్ట్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా పార్ట్ 1 భారీ ఓపెనింగ్స్ అందుకుంది.ప్లాప్ టాక్ వచ్చినా 200 కోట్ల క్లబ్ లోకి చేరి అందరిని ఆశ్చర్య పరిచింది.ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు.

బ్రహ్మాస్త్ర – శివ్ పేరుతొ తెరకెక్కిన మొదటి పార్ట్ 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడు డైరెక్టర్.ఇక ఇప్పుడు బ్రహ్మాస్త్ర – దేవ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.తాజాగా ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అలియా భట్ తన మనసులోని మాటలను బయట పెట్టింది.
ఈ సినిమా రెండవ పార్ట్ లో దీపికా పదుకోనె కీలక పాత్ర పోషించాలని ఆశ పడుతున్న తెలిపింది.

మరి ఇప్పటికే ఇందులో షారుఖ్ కూడా నటిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దీపికా పేరు కూడా అలియా చెప్పడంతో ఈ సినిమా కోసం చాలా మంది స్టార్స్ ను రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తుంది.మరి పార్ట్ 1 బడ్జెట్ నే వెనక్కి తేలేక పోయిన ఈ సినిమాకు పార్ట్ 2 కోసం ఎంత బడ్జెట్ పెడతారో చూడాలి.







