ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల పోటీకి సోనియా గాంధీ కుటుంబం దూరంగా ఉంది.సోనియా కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
ఎన్నికల్లో రాహుల్ గాంధీ సహా ఎవరూ పోటీకి దిగడం లేదన్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ పోటీ రేసులో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.అధ్యక్ష పదవి ఎన్నికకు కమల్ నాథ్, మనీశ్ తివారీ, దిగ్విజయ్ పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అటు శశిథరూర్, అశోక్ గెహ్లాట్ ఇప్పటికే పోటీకి సిద్ధంగా ఉన్నారు.కాగా రేపటి నుంచి ఈనెల 30 వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగనున్న విషయం తెలిసిందే.