అబ్బో … జండూ బామ్ కావలి బాబోయ్ అంటున్నారు తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 చూస్తున్న జనాలు.ఒక్కొక్కరు ఒక్కో వెర్రి తో జనాలను ఒక ఆడుకుంటున్నారు.
తమలో తామే కొట్టుకుంటూ జనల ఓపికకు పరీక్ష పెడుతున్నారు.ఒక వైపు నాగార్జున ను, బిగ్ బాస్ ని కూడా ఏకి పారేస్తోంది శ్రీ సత్య.
మరో వైపు తమ సొంత టీమ్ ని సైతం పనిగట్టుకొని ఆడిస్తున్న ఇంటి సభ్యులు.వెరసి షో మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతున్న పరిస్థితి.
హోస్ట్ నాగార్జున సైతం పేలవమైన యాంకరింగ్ తో పెద్దగా షో పై బజ్ క్రియేట్ చేయలేకపోతున్నాడు.మా డబ్బులు మాకు వస్తే చాలు ఆట ఎలా ఉంటె ఏంటి అన్నట్టుగా ఇంటి సభ్యుల బిహేవియర్ కనిపిస్తుంది.
ఇక్కడ వరకు కూడా ఎంతో కొంత మార్పులు చేర్పులు జరిగితే షో సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్ళచ్చు.కానీ అసలు బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా షో పైన ఇంట్రెస్ట్ పోయిందా ఏంటి అనే అనుమానాలు కలుగుతున్నాయి.
అగ్రిమెంట్ చేసుకున్న బ్రాండ్స్ పోయిన, టిఆర్ పి రేటింగ్ రాకపోయినా ఏం పర్వాలేదు అన్నట్టుగా బిగ్ బాస్ నిర్వాహకులు ప్రవర్తిస్తున్నారు.ఒక సీజన్ లో వచ్చిన బ్రాండ్స్ మరో సీజన్ లో లేకపోతుంటేనే మనం అర్ధం చేసుకోవచ్చు.
తొలి తెలుగు అతి పెద్ద రియాలిటీ షో అనే పేరు మాత్రం చెప్పుకుంటే సరిపోదు అలాగే వారి షో పని తీరు కూడా ఉండాలి అని భావిస్తున్నారు.

అసలు ఈ స్టార్ గ్రూప్ వల్లే బిగ్ బాస్ షో ని అండర్ రేటింగ్ షో గా నడిపిస్తున్నారు అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి.దీని వెనక ఏదైనా మతలబు ఉందా లేక ఏదైనా వాణిజ్య ఎత్తుగడ రాబోతోందా అనే వాదన సైతం వినిపిస్తుంది.ఇది ఇలాగే కొనసాగితే ఫైనల్ గా పోయేది హోస్ట్ నాగార్జున పరువే కాబట్టి అక్కినేని ఫాన్స్ కాస్త హడావిడి చేస్తున్నారు.
మరి ముందు ముందు ఈ షో నడవాలంటే చాల మార్పులు అవసరం అనేది మాత్రం తథ్యం.







