బుధవారం ఏపీ అసెంబ్లీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మార్చడంపై జరిగిన చర్చలో పలు వైసీపీ నేతలు చంద్రబాబుకు సంబంధించిన అసెంబ్లీలో ప్రదర్శించారు.వివిధ పేపర్ క్లిప్‌లను, వీడియోను చూపిస్తూ ఎన్టీఆర్‌ను చంద్రబాబు అవమానించాడంటూ విరుచుకుపడ్డారు.
వీటికి సంబంధించిన పలు వీడియోలు, క్లిపింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ అసెంబ్లీలో ఎన్టీఆర్ యూనివర్శిటీ సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు.ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని, అధికారాన్ని బలవంతంగా లాక్కోవడంతోపాటు మామగారు ఎన్‌టి రామారావుతో చంద్రబాబు నాయుడు వ్యవహారశైలి గురించి వివరిస్తూ.
25 ఏళ్ల క్రితం ప్రచురించిన ‘మాకు ఎన్టీఆర్ అవసరం లేదు’ అనే టైటిల్‌తో కూడిన పేపర్ క్లిప్‌ను మంత్రి రజనీ చూపించారు.ఈ క్లిప్‌ను ప్రస్తావిస్తూ, ఎన్టీఆర్‌లో నైతిక విలువలు లేవని నాయుడు పేర్కొన్నారని, అందుకే కి “ఎన్టీఆర్ అవసరం లేదని” స్టెట్‌మెంట్ చంద్రబాబు ఇచ్చారన్నారు.ఇది గౌరవం, అంకితభావం రెండూ లేకపోవడాన్ని ప్రతిబింబిస్తోందని, ఇక్కడ ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నాయుకుడితో సహా టీడీపీ నేతలకు లేదన్నారు.

మా అధినేత, ముఖ్యమంత్రి జగన్‌కు ఎన్టీఆర్ పట్ల ఎంతో గౌరవం ఉందని అందుకే కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారన్నారు.అలాగే చంద్రబాబు నాయుడు, రాధాకృష్ణ ఇంటార్వ్యూకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ కూడా అసెంబ్లీ స్క్రీన్‌పై ప్రదర్శించబడింది.ఇందులో సంక్షేమ పథకాల నుంచి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై నాయుడు మాట్లాడుతూ తన మామగారిని అమర్యాదగా సంబోధించారన్నారు.మంత్రి రజనీ వీడియో క్లిప్‌ను ఉటంకిస్తూ నాయుడుకు ఎన్టీఆర్‌పై గౌరవం లేదని, ఆయన, ఇతర టీడీపీ నాయకులు పేరు మార్పుపై డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.







