కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ పదవి కోసం ఇద్దరూ సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు.
ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి కీలక నేత రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.అధ్యక్ష రేసులో తాను లేనని మరోసారి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే పదవి మాత్రమే కాదు భావి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే అని అన్నారు.కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీ కుటుంబం తటస్థంగా ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చారు.
అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరగాలి.

ప్రస్తుతం రాహుల్ గాంధీ “భారత్ జొడో యాత్ర” చేస్తున్నరు.కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు జరిగే ఈ యాత్ర ప్రస్తుతం కేరళలో జరుగుతుంది.ఈ క్రమంలో యాత్రలో భాగంగా కొచ్చిన్ లో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకి భారీ ఎత్తున ప్రజల నుండి స్పందన వస్తుంది.మరోపక్క కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పార్టీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో ఎవరు ఈ అధ్యక్ష పదవిని అధిరోహిస్తారో అన్నది సస్పెన్స్ గా నెలకొంది.







