మెగా డాటర్ శ్రీజ కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె నిత్యం ఏదో ఒక విషయం ద్వారా తరచు వార్తల్లో నిలుస్తున్నారు.
ముఖ్యంగా శ్రీజ పెళ్లి విషయంలో పెద్ద ఎత్తున సంచలనంగా మారారు.ఈమె మొదటిసారి తన ప్రియుడు శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడమే కాకుండా తన కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని ఏకంగా తన కుటుంబంపై కూడా కేసు వేయడానికి వెనకాడ లేదు.
అయితే వీరిద్దరికి ఒక అమ్మాయి జన్మించిన తర్వాత కొన్ని మనస్పర్ధలు కారణంగా శ్రీజ విడాకులు తీసుకుని తన తండ్రి సూచించిన కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడపారు.ఇక వీరిద్దరికీ మరొక అమ్మాయి జన్మించింది.ఇలా ఇద్దరు పిల్లలకు తల్లి అయినటువంటి శ్రీజ గత కొద్దికాలం నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.
శ్రీజ కళ్యాణ్ ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చాయని వీరిద్దరూ కూడా విడాకులు తీసుకొని విడిపోయారంటూ వార్తలు వచ్చాయి.ఈ విధంగా ఈమె పెళ్లి విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన మెగా కుటుంబం మాత్రం ఏ విధంగా స్పందించలేదు.
అలాగే శ్రీజ మూడవ పెళ్ళికి, కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లికి కూడా సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే శ్రీజ ఈ విషయం గురించి డిప్రెషన్ లో ఉండడంతో తనని సంతోషంగా ఉంచడం కోసం తన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు తనని వెకేషన్ కి తీసుకెళ్లడం సరదాగా పార్టీలు ఫంక్షన్లు అంటూమెగా సిస్టర్స్ అందరూ తనని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయం గురించి శ్రీజ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ కష్ట సమయాలలో తనకు తోడుగా ఉన్నటువంటి కుటుంబానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.నేను కోపంలో ఉన్నప్పుడు నవ్వించారు ఏడుస్తున్నప్పుడు నా భుజాన్ని తట్టి భరోసా ఇచ్చారు నేను మాట్లాడాలనుకున్నప్పుడు మీరు విన్నారు ఇలా ప్రతి కష్ట సమయంలోనూ నాకు అండగా నిలిచిన నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కృతజ్ఞతలు అంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.