కార్తికేయ 3 గురించి దర్శకుడు చెప్పిన ఇంట్రెస్టింగ్‌ విషయం

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఉత్తర భారతం తో పాటు దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సాధించిన వస్తువులు కలెక్షన్స్ సినిమా యొక్క స్థాయిని చెప్పకనే చెబుతున్నాయి.

 Nikhil And Chandu Mondeti Karthikeya 3 Movie Update , Nikhil, Chandu Mondeti,-TeluguStop.com

దాదాపుగా 120 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా సీక్వెల్ ఉండబోతుందని ఇప్పటికే దర్శకుడు చందు మొండేటి ప్రమోషన్ ఇంటర్వ్యూలో తెలియజేసిన విషయం తెలిసిందే.అయితే ఆయన మొదటి సినిమాకు రెండవ సినిమాకు ఏకంగా నాలుగైదు సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాడు.

కనుక మూడవ సినిమా రావడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు, కానీ దర్శకుడు చందు మండేటి మాట్లాడుతూ మరీ ఆలస్యం కాకుండా సినిమా ను ప్రేక్షకులు ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించాడు.అతి త్వరలోనే మూడవ పార్ట్ కు సంబంధించిన పనులు మొదలు పెట్టబోతున్నట్లుగా ఆయన అధికారికంగా ప్రకటించాడు.

మరో వైపు హీరో నిఖిల్ కూడా మూడవ భాగం కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నానంటూ గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పు కొచ్చాడు.కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్తికేయ 3 సినిమా పట్టాలెక్కి అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ చర్చ జరుగుతుంది.

మొదటి భాగం లో స్వాతి హీరోయిన్ గా నటించగా రెండవ పార్ట్ లో అనుపమ పరమేశ్వరన్ హీరో గా నటించిన విషయం తెలిసిందే.మరి మూడవ పార్ట్‌ సినిమా లో ఎవరు హీరోయిన్ గా నటిస్తారు అనేది ఆసక్తిగా మారింది.

Telugu Anupama, Chandu Mondeti, Karthikeya, Nikhil, Tollywood-Movie

ప్రస్తుతం నిఖిల్ కమిట్ అయి ఉన్న సినిమా లు అన్ని పూర్తయిన తర్వాత ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే ఉద్దేశంతో దర్శకుడు చందు మొండేటి ఉన్నట్లుగా తెలుస్తోంది.హిందీ నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణం లో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రూ.200 కోట్ల వసూళ్ల లక్ష్యంగా కార్తికేయ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube