తెలంగాణ మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్ తగిలింది.మహిళా కీలక నేత పోలీసుల ఎదుట లొంగిపోయారు.
మావోయిస్ట్ అగ్రనేత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య సావిత్రి భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయారు.ఇటీవలే రామన్న అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే.
భర్త మృతి తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్న సావిత్రి.తాను లొంగిపోతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ క్రమంలో సాయంత్రం డీజీపీ మహేందర్ రెడ్డి సమక్షంలో మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.







