మరోసారి తల్లి కాబోతున్న యాంకర్ లాస్య.. ఆ ఫొటోలతో క్లారిటీ!

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లాస్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.కెరియర్ మొదట్లో మ్యూజిక్ ఛానల్ కు యాంకర్ గా వ్యవహరించిన ఈమె అనంతరం పలుకులు కార్యక్రమాలకు కూడా యాంకర్ గా వ్యవహరించారు.

 Anchor Lasya Becoming Mother Again Clarity With That Photos Details, Anchor Lasy-TeluguStop.com

యాంకర్ రవితో కలిసి లాస్య పెద్ద ఎత్తున సందడి చేశారు.ఇలా కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి లాస్య ఈ మధ్యకాలంలో బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.

ఈమె తన ప్రేమించిన వ్యక్తి మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.ఇలా పెళ్లి అనంతరం బుల్లితెర కార్యక్రమాలకు దూరమైన లాస్య సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న లాస్య ఈ కార్యక్రమం అనంతరం ప్రత్యేక ఈవెంట్లలో పాల్గొని అభిమానులను సందడి చేస్తున్నారు.

ఈ విధంగా తన భర్తతో కలిసి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి లాస్య గత కొద్ది రోజుల క్రితం అనారోగ్య సమస్యలకు గురై ఆస్పత్రిలో అడ్మిట్ అయిన విషయాన్ని తన భర్త మంజునాథ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఈ క్రమంలోనే నటి లాస్యకు ఏం జరిగిందోనని అభిమానుల సైతం ఆందోళన వ్యక్తం చేశారు.

Telugu Anchor, Anchor Lasya, Anchorlasya, Junnu, Lasya Manjunath, Manjunath-Movi

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలియజేయడమే కాకుండా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.ఈ క్రమంలోనే లాస్య ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్, అల్ట్రా సౌండ్ స్కానింగ్ రిపోర్ట్ లను చూపిస్తూ తాను మరోసారి తల్లి కాబోతున్నాననే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇలా లాస్య మరోసారి తల్లి కాబోతుంది అనే విషయాన్ని ప్రకటించడంతో అభిమానులు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Telugu Anchor, Anchor Lasya, Anchorlasya, Junnu, Lasya Manjunath, Manjunath-Movi

అయితే లాస్య మంజునాథ్ దంపతులకు పెళ్లయిన తర్వాత ఒక కుమారుడు జన్మించిన విషయం మనకు తెలిసిందే.ప్రస్తుతం బాబుకి మూడు సంవత్సరాలు పూర్తి అయ్యాయి.నిత్యం లాస్య తన వీడియోలలో తన కుమారుడి జున్నుకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే మరోసారి తన కుమారుడు జున్నుకి బుజ్జి చెల్లో,తమ్ముడు రాబోతున్నారని విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తూ లాస్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube