ఏపీ సీఎం జగన్ ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు.అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో కలిసిన ఆయన .
జగన్ కు స్వామివారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు.అనంతరం తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా ఆహ్వాన పత్రాన్ని అందించారు.
ఈనెల 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.