వయసు పెరుగుతున్నా, కొంత మందిలో వక్ర బుద్ధి మాత్రం పోదు.పైగా తమకన్నా ఎంతో చిన్న వారిపై కన్నేసి, లైంగిక వేధింపులకు గురి చేస్తుంటారు.
ఇలాంటివి ప్రస్తుత సమాజంలో మనం నిత్యం చూస్తున్నాం.ముఖ్యంగా అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారు.
ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, కామాంధుల చేతిలో అమ్మాయిలు బలయ్యే ప్రమాదం ఉంది.తాజా ఇలాంటి పరిస్థితి ఓ 19 ఏళ్ల యువతికి ఎదురైంది.
ఫుడ్ ఆర్డర్ పెట్టగానే ఓ డెలివరీ మ్యాన్ వచ్చాడు. ఒంటరిగా ఉందని తెలుసుకుని లైంగికంగా వేధించాడు.
దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ప్రస్తుత కాలంలో అంతా ఆన్‌లైన్ ఆర్డర్లకు అలవాటు పడ్డారు.ఏం కావాలన్నా క్షణాల్లో ఫోన్ తీసి, చకచకా ఆర్డర్ చేస్తున్నారు.ముఖ్యంగా ఫుడ్ విషయంలో స్విగ్గీ, జొమాటో వంటి వాటికి అలవాటు పడి, వంట చేయడం మానేస్తున్నారు.ఒక్కోసారి ఆకలిగా ఉన్నప్పుడు, ఫుడ్ ప్రిపేర్ చేయలేని సమయంలో ఆర్డర్ పెట్టుకుంటున్నారు.
తాజాగా పుణెకు చెందిన 19 ఏళ్ల యువతి ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంది.ఫ్లాట్‌లో ఉండే తోటి ఫ్రెండ్స్ వాళ్ల ఇళ్లకు వెళ్లారు.
ఇక సెప్టెంబర్ 17న ఆకలి వేసి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టింది.కాసేపటికి 42 ఏళ్ల వ్యక్తి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చాడు.
ఫుడ్ ఇవ్వగానే అమ్మాయి బాగుందని గమనించాడు.ఇక మాట కలిపి ఇంట్లో ఎవరెవరు ఉంటారని తెలుసుకున్నాడు.
ప్రస్తుతం ఇంట్లో యువతి ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్న అతడికి దుర్బుద్ధి పుట్టింది.మంచినీళ్లు అడిగాడు.
ఆమె తెచ్చి ఇచ్చింది.ఆ తర్వాత మరో గ్లాసు నీళ్లు అడిగాడు.
తేవడానికి ఆమె లోపలికి వెళ్తుండగా వెనుక నుంచి హఠాత్తుగా హగ్ చేసుకున్నాడు.ఆమెకు ఇష్టం లేకుండానే బలవంతంగా ముద్దులు పెట్టాడు.
ఆపై అక్కడి నుంచి జారుకున్నాడు.ఈ హఠాత్పరిణామంతో ఆ యువతి షాక్ తింది.
కాసేపటి తర్వాత ఆమె వాట్సాప్ నంబరుకు అతడు మెసేజెస్ పెట్టడం ప్రారంభించాడు.తర్వాత రోజు ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.అదే రోజు బెయిల్‌పై బయటకు కూడా వచ్చేశాడు.
ఈ ఘటన తర్వాత ఒంటరిగా ఉంటున్న అమ్మాయిలు మరింత జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు.







