బుల్లెట్ బండి పాటతో స్టార్ గా మారిన పెళ్లికొడుకు అశోక్ ఏసీబీ వలలో చిక్కుకున్నాడు.ఆయన బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు.ప్రణాళికా విభాగంలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న అశోక్ రూ.30 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు.ఇంటి నిర్మాణ విషయంలో దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద నుండి లంచం డిమాండ్ చేశాడు.ఈ క్రమంలో లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అనంతరం కార్యాలయంతో పాటు ఆయన నివాసంలోనూ సోదాలు నిర్వహించారు.







