బిగ్ బాస్ కార్యక్రమం సీజన్ సిక్స్ ప్రసారమవుతూ రెండు వారాలను పూర్తి చేసుకొని మూడవ వారంలోకి అడుగు పెట్టింది.ప్రస్తుతం మూడో వారంలో కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈసారి మాత్రం నామినేషన్ ప్రక్రియ చాలా హాట్ హాట్ గా జరిగిందని చెప్పాలి.
నామినేషన్ లో భాగంగా ఈసారి 8 మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.సాధారణంగా బిగ్ బాస్ మొదటి వారం నుంచి కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం జరుగుతుంది.
అయితే ఈ సీజన్లో మొదటివారం నో ఎలిమినేషన్ అయినప్పటికీ రెండవ వారంలో మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఇచ్చి బిగ్ బాస్ అందరికీ షాక్ ఇచ్చారు.
ఇక శనివారం ఎపిసోడ్లో భాగంగా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల పై ఈయన పెద్ద ఎత్తున మండిపడ్డారు.
హౌస్ లో కొంతమంది పేర్లను ఉద్దేశిస్తూ వీళ్ళు అసలు ఏ విధమైనటువంటి పర్ఫామెన్స్ చేయలేదని కేవలం తిని పడుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉంటే ఇప్పుడే బ్యాగ్ సర్దేయాలంటూ వార్నింగ్ ఇవ్వడంతో కంటెస్టెంట్లలో పెద్ద ఎత్తున కసి పెరగడమే కాకుండా ఈ వారం జరిగిన నామినేషన్స్ లో పెద్ద ఎత్తున గొడవ కూడా పడ్డారు.

ఇకపోతే ఈ వారం వరస్ట్ పెర్ఫార్ గా నటి శ్రీ సత్య జైలుకు వెళ్లారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ బిగ్ బాస్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు.తాను కేవలం డబ్బు కోసం మాత్రమే బిగ్ బాస్ హౌస్ కి వచ్చానట్టు కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇక మరోవైపు నటి శ్రీ సత్యతో అర్జున్ పులిహోర కలపడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒకరిపై మరొకరు పెద్ద ఎత్తున అరుచుకుంటూ ఈవారం ఏకంగా 8 కంటెస్టెంట్లను నామినేట్ చేశారు.
ఈ వారం నామినేషన్స్ లో భాగంగా రేవంత్, బాలాదిత్య, గీతూ, ఆరోహి, చంటి, వాసంతి, నేహా, శ్రీహాన్ ఈవారం నామినేషన్స్ లో ఉన్నారు.