ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోలతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఎక్కువగా ఎక్కువగా నకిస్తున్నారు.బాలీవుడ్ హీరోలు అయితే వివిధ రకాల యాడ్లతో పాటుగా మసాలా యాడ్స్ లో ఎక్కువగా నటిస్తున్నారు.
అయితే బాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ మసాలా యాడ్స్ లో బిజీగా ఉండటం వల్లే హిందీ సినిమా ప్రభావం కోల్పోతుంది అని ప్రముఖ హిందీ దర్శకుడు ప్రకాశ్ ఝా ఆరోపించారు.బాలీవుడ్ ఇండస్ట్రీ కాకుండా మిగిలిన ఇండస్ట్రీలు వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు రూపొందిస్తుండగా బాలీవుడ్ అగ్ర హీరోల మాత్రం పాన్ మసాలా బ్రాండ్లను ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు అంటూ ఆయన విమర్శించారు.
కాగా ప్రకాశ్ ఝా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మత్తో కీ సైకిల్. ఈ సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన సందర్భంగా తాజాగా ఒక మీడియాతో ముచ్చటించారు ప్రకాష్.పెద్ద హీరోలతో సినిమాలు తీయకపోవడానికి కారణమేంటి?అన్న ప్రశ్న పై స్పందిస్తూ.వాళ్లకి కథలు వినే తీరిక లేదు.ఎందుకంటే వాళ్లంతా పాన్ మసాలాలను ప్రమోట్ చేయడంలో బిజీ బిజీగా ఉన్నారు.ఆ ఉత్పత్తులు ఎంతమంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయనేది వారికి అనవసరం.

కేవలం ఒక్క యాడ్ చేస్తే ఆ రోజు సాయంత్రానికి వారి ఖాతాల్లోకి రూ.50 కోట్లు పడుతున్నాయి.ఇక వారికి కథ వినడంపై ఆసక్తి ఏముంటుంది? కంటెంట్ ఉన్న సినిమాలు ఎలా వస్తాయి.అందుకే పెద్ద హీరోలు నాతో సినిమాలు చేయట్లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు ప్రకాశ్ ఝా.దర్శకుడిగా ప్రకాష్ ఝా మృత్యుదంద్, దిల్ క్యాకరే, గంగాజల్, అపహరణ్, రాజ్‌నీతి, సత్యాగ్రహ తదితర రాజకీయ నేపథ్య చిత్రాలకు దర్శకత్వం వహించారు.దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నాడు ప్రకాశ్ ఝా.కాగా ఇప్పటివరకు 30కి పైగా సినిమాలను తెరకెక్కించారు.పలు చిత్రాలకు నేషనల్ అవార్డులు అందుకున్నారు.







