గిరిజనుల రిజర్వేషన్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.రాష్ట్రంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు చెప్పారు.
ఈ మేరకు వారం రోజుల్లో జీవోను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.అయితే, ఆ జీవోను గౌరవిస్తారా.? లేదా దాన్నే ఉరితాడు చేసుకుంటావా.? అని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు.కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయామన్న కేసీఆర్.ఈ నేపథ్యంలో రాష్ట్రమే రిజర్వేషన్లను అమలు చేస్తుందని వెల్లడించారు.అదేవిధంగా తెలంగాణలో త్వరలోనే గిరిజన బంధు పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.







