బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది గెటప్ శ్రీను సుడిగాలి సుదీర్ వంటి వారు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి పూర్తిగా రేటింగ్ పడిపోయింది.
అయితే కొన్ని కారణాల వల్ల గెటప్ శ్రీను హైపర్ ఆది ఈ కార్యక్రమానికి దూరమైనప్పటికీ తిరిగి ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.ఇక సుడిగాలి సుదీర్ మాత్రం ఎప్పటికీ రీఎంట్రీ ఇవ్వలేదు.
ఇకపోతే ఈ వారం జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది సందడి చేయడంతో ఈ కార్యక్రమం భారీ రేటింగ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.గత వారం నుంచి ఆది ఎంట్రీ ఇచ్చినటువంటి ప్రోమోతో ఈ కార్యక్రమం పై భారీ హైప్ క్రియేట్ చేశారు.
ఈ క్రమంలోనే ఎప్పుడు 13 నిమిషాల పాటు ఉండే హైపర్ ఆది స్కిట్ ఈసారి 14 నిమిషాల ఇచ్చారు.అలాగే హైపర్ ఆది స్కిట్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారని చెప్పాలి.
ఇలా హైపర్ ఆది ఈ కార్యక్రమానికి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎప్పటిలాగే తనదైన స్టైల్ లో పంచ్ ల వర్షం కురిపిస్తూ సందడి చేశారు.

హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి తిరిగి రావడంతో ఈ కార్యక్రమ రేటింగ్ కూడా భారీగానే పెరిగిందని తెలుస్తోంది.గత కొంతకాలం నుంచి అత్యంత తక్కువ రేటింగ్ తో ముందుకు సాగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఒక్కసారిగా రేటింగ్ అమాంతం పెరిగిపోయింది.అనధికారిక సమాచారం ప్రకారం 12 నుండి 15 రేటింగు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
హైపర్ ఆది రీఎంట్రీ ఇవ్వడంతో ఈ కార్యక్రమానికి పూర్వ వైభవం వచ్చిందని చెప్పాలి.







