ది ఘోస్ట్ సినిమా.. హీరోయిన్ కి తీవ్ర గాయాలు.. ఫోటోలు వైరల్!

సాధారణంగా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి.కొన్ని కొన్ని సార్లు హీరో హీరోయిన్లు సైతం గాయపడుతూ ఉంటారు.

 Sonal Chauhan Fractures Foot While Training For Nagarjunas The Ghos Still Wraps-TeluguStop.com

మరి ముఖ్యంగా హీరోలు దూకడం ఫైటింగ్స్ వంటి సీన్లు కొన్ని రియల్ గా చేసినప్పుడు దెబ్బలు తగలడం లాంటివి జరుగుతూ ఉంటాయి.అయితే సినిమాలో ఎంత డూప్స్ పెట్టినా కూడా కొన్ని కొన్ని సార్లు కొన్ని కష్టమైన సన్నివేశాలలో నటించాల్సి ఉంటుంది.

అయితే తాజాగా నాగార్జున హీరోయిన్ కూడా ఈ విధంగానే జరిగింది.షూటింగ్ లో భాగంగా ఆమె గాయాల పాలయ్యింది.

ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అసలు విషయంలోకి వెళితే.

హీరోయిన్ సోనాల్ చౌహాన్ మనందరికీ సుపరిచితమే.ఈమె తెలుగులో లెజెండ్, లయన్ లాంటి సినిమాలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం సోనాల్ చౌహన్ నాగార్జున హీరోగా నటిస్తున్న ది ఘోస్ట్ సినిమాలో నటిస్తోంది.తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఒక ఊహించని సంఘటన జరిగిందట.

అదేమిటంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కోసం సోనాల్ చౌహన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అనుకోకుండా సోనాల్ చౌహాన్ కాలు విరిగిందట.వెంటనే స్పందించిన చిత్ర బృందం చికిత్స చేయించగా వైద్యులు ఆమెను ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించారట.

Telugu Balakrishna, Legend, Nagarjuna, Sonal Chauhan, Ghost, Tollywood-Movie

ముఖ్యంగా యాక్షన్స్ అన్ని వేషాలకు దూరంగా ఉండమని చెప్పారట.నాగార్జున నటిస్తున్న ఘోస్ట్ సినిమాను దసరాకు విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో ఎలా అయినా సరే సన్నివేశాలను పూర్తి చేయాలి అని కాలికి దెబ్బ తగిలినా కూడా సోనాల్ షూటింగ్లో పాల్గొని షూటింగ్ను పూర్తి చేసిందట.కాగా ఎందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ ఫోటోలలో సోనాల్ చౌహాన్ కాలికి దెబ్బ తగిలి కట్టు కనిపిస్తోంది.అలాగే మరొక ఫోటోలో దెబ్బ తగిలినా కూడా అందుకు సంబంధించిన సేఫ్టీని ఉపయోగించి మరీ షూటింగ్లో పాల్గొంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube