సోషల్ మీడియా వచ్చాక వింతలు, వినోదాలకు అడ్డులేకుండా పోతుంది.ఎన్నో ఫన్నీ వీడియోస్‌తో ఎంజాయ్ చేస్తున్నారు నెటిజన్లు.
అంతే కాకుండా ఎక్కడ ఏ చిన్న సంఘటన లేదా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగినా అది క్షణాల్లో మన ముందు ఉంటుంది.అయితే తాజాగా ఓ ట్రాఫిక్ పోలీస్ చేసిన అల్లరి, అందరినోట నవ్వులు పూయిస్తుంది.
ఎవరైనా సరే ట్రాఫిక్ పోలీసు నిలుచుండి, రూల్స్ చెబుతుంటారు.కానీ ఈయన ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ లో డ్యాన్స్ చేస్తూ .విధులు నిర్వహిస్తూ, వాహనదారులను ఆకట్టుకున్నాడు.దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఉన్న ఓ సిటీ హార్డ్ ఆసుపత్రి వద్ద హోంగార్డ్ జోగింద్ర కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు.ఈ నేపథ్యంలో ఆయన వాహనాలను వినూత్న రీతిలో నియంత్రిస్తున్నాడు.
నలువైపుల వస్తున్న వాహనాలు క్లియర్ చేయడానికి ఆయన డ్యాన్స్ చేస్తూ.చూపించిన సైగలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
అంతేకాకుండా వాహనాదారులు సైతం బైక్స్ ఆపి మరి చూడటం మొదలు పెడుతున్నారు.ఇక దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
దీంతో నెట్టింట్లో ఈ వీడియోకు లైక్స్‌తో పాటు, కామెంట్ల వర్షం కురుస్తుంది.విధులు నిర్వహించడంలో కూడా ఇంత తెలివిగా వ్యవహరించిన ట్రాఫిక్ పోలీసు నువ్వు సూపర్ అంటూ కొందరు కామెంట్స్ పెడితే మరికొందరు, ట్రాఫిక్ భయ్యా నువ్వు గ్రేట్ అంటున్నారు.
ఇంకా ఒక నెటిజన్ స్పందిస్తూ.నేను అతన్ని రోజూ చూస్తాను.
ఆఫీసుకు వెళ్తున్న ఎంతో మంది మూడ్‌ను ఆయన ఛేంజ్ చేసి అందరిలో సంతోషాన్ని నింపుతాడు.అతన్ని దేవుడు చల్లగా చూడాలి అంటూ దీవిస్తున్నారు.
అంతే కాదండోయ్.ఈ ట్రాఫిక్ పోలీసును చూడటానికే కొందరు రోజూ అదే రూట్లో వెళ్తారంట.
మరి ఇంకెందుకు లేటు మీరు చూసేయండి.







