ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచే పాలన కొనసాగుతుందన్నారు.
ఈ క్రమంలో అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు.దీనిపై త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామని వ్యాఖ్యనించారు.
విశాఖ రాజధానికి ఒక్క సెంటు కూడా ప్రైవేట్ భూమి తీసుకోలేదన్నారు.త్వరలోనే విశాఖలో బిజినెస్ డెవలప్మెంట్ సమ్మిట్ ఉంటుందని తెలిపారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్న ఆయన.301 అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకింగ్స్ ఇచ్చారని వెల్లడించారు.







