బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో విషయంలో ప్రేక్షకులలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి.బిగ్ బాస్ షో ప్రతి సీజన్ లో జబర్దస్త్ కమెడియన్లకు ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే కొంతమంది కమెడియన్లు ఆ ఆఫర్ పై ఆసక్తి చూపిస్తుంటే మరి కొందరు మాత్రం ఆసక్తి చూపించడం లేదు.జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన కమెడియన్లలో అప్పారావు కూడా ఒకరు.
ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పారావు మాట్లాడుతూ నాగబాబు గారు వెళ్లిన సమయంలో జబర్దస్త్ రేటింగ్ తగ్గిందని ఆయన అన్నారు.నాగబాబు గారు వెళ్లిపోయిన సమయంలో అందరం బాధ పడ్డామని ఆయన తెలిపారు.
రోజాగారు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారని అప్పారావు అన్నారు.నాగబాబు గారు నన్ను ఎంతగానో గౌరవించారని ఆయన చెప్పుకొచ్చారు.
నేను బిగ్ బాస్ షోకు వెళుతున్నానని ప్రచారం చేశారని ఆయన తెలిపారు.జబర్దస్త్ లో ఉన్నప్పటి కంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.ఎక్కడికి వెళ్లినా నన్ను పలకరించే వాళ్లు నా భార్యను కూడా అడుగుతారని అప్పారావు అన్నారు.బిగ్ బాస్ షోలో మూడుసార్లు ఆఫర్ వచ్చిందని అప్పారావు తెలిపారు.
అగ్రిమెంట్ లో ఉండటం వల్ల నేను వెళ్లలేకపోయానని అప్పారావు అన్నారు.

జబర్దస్త్ కళాకారుడిని బిగ్ బాస్ కు డబ్బులు తీసుకోకుండా పంపిస్తే జబర్దస్త్ కు క్రేజ్ ఉంటుందని ఆయన తెలిపారు.జబర్దస్త్ నిర్వాహకులకు డబ్బులు ఇవ్వలేక తాను బిగ్ బాస్ కు వెళ్లలేకపోయానని అప్పారావు చెప్పుకొచ్చారు.జబర్దస్త్ నిర్వాహకులు గౌరవంగా కమెడియన్లను బిగ్ బాస్ కు పంపించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు.
జబర్దస్త్ పాపులర్ కమెడియన్ అప్పారావు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.








