ఏపీ అసెంబ్లీలో పెట్టుబడులు, పరిశ్రమలపై సీఎం జగన్ ప్రసంగించారు.రాష్ట్రం ఆర్థికంగా బాగుందంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
ఈ క్రమంలోనే కేంద్రానికి, ఆర్బీఐకి తప్పుడు లేఖలు రాశారని తెలిపారు.దోచుకో, పంచుకో, తినుకో అన్నదే వారి సిద్ధాంతమని ఎద్దేవా చేశారు.
కుట్రపూరిత చర్యల్లో భాగంగానే రాష్ట్రం శ్రీలంక అయ్యిందని దుష్ఫ్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా మ్యానిఫెస్టోలోని 98.4 శాతం హామీలను అమలు చేశామని జగన్ వెల్లడించారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చి ఢోకా ఏం లేదన్నారు.
వైసీపీ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పథకాలను చూసి ఓర్వలేకనే కోర్టుల్లో కేసులు వేస్తున్నారని మండిపడ్డారు.







