టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రానా దగ్గుపాటి తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు.
తన భార్య, తమ్ముడు అభిరామ్, తండ్రి సురేష్ బాబు తో కలిసి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు.ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం టిటిడి సిబ్బంది వారికి ప్రసాదాలను అందించారు.అయితే శ్రీవారిని దర్శించుకుని రానా బయటకు వస్తూ ఉండగా ఈ క్రమంలోనే ఒక చిన్న సంఘటన జరిగింది.
ఫొటో గ్రాఫర్స్, కెమెరా వాళ్లకు కుటుంబసభ్యులతో కలిసి రానా పోజులు ఇచ్చారు.అందరూ మధ్యలో వస్తుండగా వారిని దూరంగా జరగండి అంటూ సున్నితంగా చెప్పాడు రానా.ఈ క్రమంలోనే ఒక అభిమాని సెల్ఫీ తీసుకోవడం కోసం రానా దగ్గరకు వచ్చి నాకు దగ్గరగా ముఖం పెట్టి సెల్ఫీ అని అడగగా వెంటనే రానా అతని ఫోన్ తీసుకొని గుళ్లో ఇటువంటి పనులు చేయకూడదమ్మా తప్పు అని చెప్పి అనంతరం ఆ ఫోన్ అతనికి తిరిగి ఇచ్చేసి బయటకు వెళ్లిపోయాడు.

అభిమాని కూడా నవ్వుతూ మొబైల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.ఇకపోతే హీరో రానా తమ్ముడు అభిరామ్ దగ్గుపాటి అహింస అనే సినిమాతో సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.హీరో రానా విషయానికి వస్తే.
రానా చివరిగా విరాటపర్వం సినిమాలో నటించారు.ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలలో నటించలేదు.







