హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమై రేపు 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.ఈ క్రమంలో నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువత భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
రేపు హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ చేస్తారు.
నెక్లెస్ రోడ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ఆదివాసీ గిరిజన కళారూపాలతో భారీ ఊరేగింపు చేపట్టనున్నారు.అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు.18వ తేదీన జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులను, కళాకారులను సన్మానించనున్నారు.అదేవిధంగా జాతీయ సమైక్యత, సమగ్రతను చాటే కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వం వెల్లడించింది.







