గాలి జనార్దన్ రెడ్డి కేసు విచారణపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాల పై సీబీఐ కేసును నమోదు చేసింది.గాలి జనార్దన్ రెడ్డి తో పాటు మరో తొమ్మిది మందిపై కూడా 2009 లో కేసులు నమోదు చేసింది సిబిఐ.2015 లో గాలి జనార్దన్ రెడ్డికి కొన్ని షరతులతో కూడిన బెయిల్ ను కూడా సుప్రీంకోర్టు మంజూరు చేసింది.2020లో గాలి జనార్దన్ రెడ్డి నేను బెయిల్ షరతులు పాటిస్తున్నానని సుప్రీం కోర్ట్ షరతులలో కొంత సడలింపు కావాలని సుప్రీం కోర్టుకి తన న్యాయవాది తరఫున కోరాడు.

 Supreme Court Disappointed With Gaali Janardhan Reddy Case Investigation Details-TeluguStop.com

అప్పుడు సుప్రీం కోర్టు గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాది వాదనలు విని సడలింపుల కు ఆమోదం తెలిపింది.ప్రస్తుతం సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మాధవి దివాన్‌ వాదనలు వినిపించారు.

వాదనలు వినిపించిన తర్వాత సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఈ కేసు విచారణ ఏ దశలో ఉంది అని ప్రశ్నించారు.విచారణ జరగడం లేదని మాధవి దివాన్ చెప్పగా, ఈ విషయం విన్నా న్యాయమూర్తి గారు 12 సంవత్సరాల క్రితం నమోదైన కేసు గురించి హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఇంకా ఈ కేసు పై విచారణ జరగకపోవడం దురదృష్టకరమని చెప్పారు.

Telugu Gaalijanardhan, Gali Janardhan, Galijanardhan, Supreme-Political

సుప్రీం కోర్ట్ గతంలో ఆదేశించిన విచారణ ఎందుకు ఆలస్యం అవుతుంది అని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు.సీబీఐకి విచారణలో ఏవైనా అడ్డంకులు ఉన్నాయా అని కూడా ప్రధాన న్యాయస్థానం ప్రశ్నించింది.ఈనెల 19 వ తేదీ లోగా సీల్డ్ కవర్ లో విచారణ నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్ట్ సీబీఐ కేసుల విచారణ కోర్ట్ స్పెషల్ జడ్జి ని ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube