భూమా మౌనిక, మనోజ్ కలిసే ఉన్నారు.. గోనె ప్రకాష్ కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలో హాట్ టాపిక్ గా ఉన్నటువంటి విషయాలలో మంచు మనోజ్ భూమా మౌనిక పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారింది.వీరిద్దరూ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

 Bhuma Mounika And Manoj Are Together Gone Prakashs Comments Are Viral , Bhuma Mo-TeluguStop.com

ఇక గణేష్ చతుర్థి రోజు వీరిద్దరూ కలిసి ఆలయానికి వెళ్లడంతో అప్పటినుంచి వీరి పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి.ఇదే విషయంపై మంచు మనోజ్ ను ప్రశ్నిస్తే సరైన సమయం చూసుకొని సమాధానం చెబుతా అంటూ దాటవేశారు.

ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని తెలియగానే వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.తాజాగా భూమా మౌనిక, మంచు మనోజ్ గురించి ఎమ్మెల్యే గోనె ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ భూమా మౌనిక మనోజ్ పెళ్లి చేసుకోవడం ఏంటి వీళ్లిద్దరూ ఎప్పటినుంచో సహజీవనం చేస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.

Telugu Bhumamaunik, Bhuma Mounika, Prakash, Hyderabad, Madras, Manoj, Mla Prakas

నిజానికి వీరిద్దరూ మొదటిసారి పెళ్లి చేసుకోవాల్సి ఉంది అయితే భూమా నాగిరెడ్డి కుటుంబం అందుకు నిరాకరించడంతో వీరిద్దరూ వేరే వ్యక్తులను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.భూమా మౌనికకు కుమారుడు జన్మించిన తర్వాత పలు కారణాలవల్ల విడాకులు ఇచ్చి విడిపోయింది.అలాగే మంచు మనోజ్ కూడా తన భార్యతో విడిపోయారు.ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకున్న అనంతరం మద్రాస్ లో కలిసి ఉన్నారని ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాద్ కు వచ్చారంటూ ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా వీళ్ళిద్దరూ ఎప్పటినుంచో కలిసి ఉన్నారని నిజం ఇటు ఇండస్ట్రీలోనూ రాజకీయాలలోనూ అందరికీ తెలిసిన నిజం అంటూ గోనె ప్రకాష్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube