సమంత కారణంగా ఇబ్బందులు పడుతున్న విజయ్ దేవరకొండ.. అసలేమైందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ గురించి పరిచయం అవసరం లేదు.ఈయన వరుస హిట్ సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

 Khushi Movie Vijay Devarakonda Samantha Dates Clash Issue Details, Vijay Devarak-TeluguStop.com

ఇకపోతే తాజాగా ఈయన లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ తన తదుపరిచిత్రం ఖుషి సినిమాపై పెట్టుకున్నారు.

ఇక ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేస్తుంది.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇటు విజయ్ దేవరకొండ అలాగే దర్శకుడు శివ నిర్వాణ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.

అయితే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నప్పటికీ కేవలం సమంత కారణంగానే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.సమంత ఇప్పటికే దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడాఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు, టాక్ షో లతో బిజీగా ఉన్నారు.

Telugu Khushi, Kushi, Liger, Samantha, Tollywood-Movie

ఇలా ఈమె పలు కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా డేట్స్ క్లాష్ అవుతూ ఉండడంతో సినిమా తరచు వాయిదా పడుతూ వస్తోంది.ఇప్పటికే ఈ సినిమా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా సమంత డేట్స్ లేని కారణంగా ఈ సినిమా వాయిదా పడుతుందని ఈ షెడ్యూల్లో విజయ్ దేవరకొండ సమంత పై కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని సమాచారం.ఈ విధంగా సమంత వల్లే విజయ్ దేవరకొండ ఖుషి సినిమా ఆలస్యమవుతుందని చెప్పాలి.లైగర్ భారీ డిజాస్టర్ కావడంతో హిట్టు కోసం ఎదురుచూస్తున్నటువంటి విజయ్ దేవరకొండకు ఈ సినిమా మరింత ఆలస్యం కావడంతో పెద్ద సమస్యగా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube