తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును ఖమ్మం సిపిఐ కార్యాలయం నందు కలిసి తెలంగాణ రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ గురువారం వినతిపత్రం అందజేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు డబ్బులు చెల్లిస్తుందని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు డబ్బులు చెల్లించే విధంగా ప్రయత్నం చేయాలని, అగ్రిగోల్డ్ సమస్యను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కూనంనేని సాంబశివరావుకు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, రాష్ట్ర కార్యదర్శి గోగుల వెంకటేశ్వరరావు, కోశాధికారి మద్దినేని రామారావు, సభ్యులు మునగంటి వీరబ్రహ్మచారి, అనసూర్య, దెయ్యాల రామమల్లేశం, మైలవరపు లక్ష్మి, పర్సబోయిన రమాదేవి, బోల్ల లక్ష్మయ్య, ఎస్.డి పాషా, గుమ్మడివెల్లి నాగేశ్వరరావు, భూమా వెంకన్న కంచర్ల సురేష్, వీరబాబు, గుగోలోతు రాందాసు, శుభద్ర, సిహెచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.







