రాజధానిపై కేంద్రమంత్రి నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ ఎక్కడో ఉందో అది రాజధాని అవుతుందన్నారు.
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.పాలకపక్షంగా ఉన్న వైసీపీ మాట తప్పి మోసం చేసిందని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో అమరావతే రాజధాని అని సీఎం జగన్ చెప్పారన్నారు.
అమరావతి అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని కేంద్రమంత్రి నారాయణస్వామి తెలిపారు.
అదేవిధంగా చాలా ప్రాజెక్టులు ఇక్కడే పూర్తి చేస్తున్నామని వెల్లడించారు.అమరావతిలో అభివృద్ధిని ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు.
రాజధానిని ఒక జిల్లా అని ఎలా చెబుతారని ఆయన నిలదీశారు.







