మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఉన్న స్నేహబంధం గురించి మనందరికీ తెలిసిందే.కానీ ఈ ఇరువురి హీరోల అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో తరచుగా వార్ కి దిగుతూనే ఉంటారు.
మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు.అయితే తాజాగా కూడా మెగా అభిమానులు మా హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే కాదు మా హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ నందమూరి అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
ఈ ట్యాగ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
ఈ ట్యాగ్ కోసం ఒకరిని ఒకరు దూషించుకుంటూ, బూతులతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఆ బూతులు చదివి ఇతర హీరోల అభిమానులు నవ్వుకుంటున్నారు.అసలు మ్యాన్ ఆఫ్ మాసెస్ అనేది ఒక బిరుదేనా? ఎందుకు దాని కోసం ఇలా హీరోల అభిమానులు పోట్లాడుకుంటున్నారు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే చరణ్, ఎన్టీఆర్ అభిమానులు మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే బిరుదు కోసం పోటీపడి మరి కామెంట్లు ట్వీట్ లు చేస్తుండగా మరొకవైపు చిరంజీవి అభిమానులు బాస్ ఆఫ్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
ఇక బాలయ్య బాబు అభిమానులు అయితే గాడ్ ఆఫ్ మాసెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే చిరు,బాలకృష్ణ అభిమానుల గొడవ చిన్నగానే ఉన్నప్పటికీ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ చరణ్, తారక్ అభిమానులకు గొడవే ఎటు తేలేలా కనపడటం లేదు.మరి ఈ మ్యాన్ ఆఫ్ మాసెస్ ట్వీట్స్,కామెంట్స్ పై తారక్,చెర్రీ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి మరి.ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసిన తారక్ చెర్రీ అభిమానులు ఏ మాత్రం తగ్గడం లేదు.