తెలుగు చిత్ర పరిశ్రమలో నటసార్వభౌముడుగా నందమూరి తారకరామారావు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఖ్యాతిని సంపాదించారు అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది నటీనటులు ఎన్టీఆర్ పక్కన ఒక్కసారి కనిపిస్తే చాలు అని అనుకునే వారు.
కేవలం ఎన్టీఆర్ తరం వారు మాత్రమే కాదు ఆ తర్వాత తరం వారు కూడా ఎన్టీఆర్ సినిమా లో ఒక్క ఛాన్స్ వచ్చినా చాలు అని ఎంతో ఆశగా ఎదురు చూసే వారు అని చెప్పాలి.పారితోషకం కాస్త తక్కువగా ఇచ్చిన పర్వాలేదు.
కానీ అన్న గారి సినిమాలో ఛాన్స్ ఇప్పించండి అంటూ స్పెషల్ రిక్వెస్ట్ లు కూడా చేసుకునేవారట.
అయితే ఎన్టీఆర్ వయసుతో సంబంధం లేకుండా శ్రీదేవి జయసుధ జయప్రద వాణిశ్రీ ఇలా ఎంతో మంది తో నటించి డాన్సులు కూడా చేసి ప్రేక్షకులను మెప్పించారు.
అయితే మనందరికీ తెలిసిన ఒక సీనియర్ హీరోయిన్ కు మాత్రం ఎన్టీఆర్తో కలిసి నటించే అవకాశం ఒక్కసారి కూడా దొరకలేదట.ఆ హీరోయిన్ ఎవరో కాదు సుహాసిని.
ఎన్టీఆర్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే సుహాసిని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.సుహాసిని తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది.
అయినప్పటికీ అన్నగారు సినిమాలో మాత్రం ఛాన్స్ తగ్గలేదట.

ఈ విషయమే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.1983లో వచ్చిన స్వాతి సినిమాలో క్యారెక్టర్ నటుడు పాత్ర కోసం సుహాసిని అన్న గారిని సంప్రదించిందని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.ఈ సినిమాలో శారద నటించిన స్వాతి పాత్రకు తల్లి పాత్ర చేసింది.
అయితే చిన్నప్పుడే భర్తను కోల్పోయిన తన తల్లి కి మళ్లీ పెళ్లి చేసింది స్వాతి.భర్త గా కొంగర జగ్గయ్య నటించారు.జగ్గయ్య పాత్రకోసం ఎన్టీఆర్ ను తీసుకోవాలని దర్శకుడు క్రాంతికుమార్ అనుకున్నారట.కానీ అన్నగారు అప్పటికే బిజీగా ఉండటంతో చివరికి ఈ సినిమా ఒప్పుకోలేక పోయారు.
ఇలా అన్న గారితో నటించే అవకాశం మిస్ చేసుకున్న సుహాసిని. ఆ తర్వాత మాత్రం నటించే అవకాశం అందుకోలేకపోయింది.