ఎలెన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు.ప్రపంచంలోనే నంబర్ 1 ధనికుడైన ఇతగాడు అనునిత్యం వార్తల్లో నిలుస్తాడు.
ఇక ఈ ధనవంతుడి ఎఫైర్లకు లేక్కే లేదు.ఐదారేళ్లకో అమ్మాయిని మార్చి సంసార సుఖాన్ని బాగా ఎంజాయ్ చేస్తాడన్న ఆరోపణలు ఇతగాడిమీద బాగానే వున్నాయి.
ఇప్పటికే 9 మందికి సంతానం కలిగి వున్న ఎలెన్ మరింతమందిని కనే పనిలో వున్నాడట.అలాగే బ్రేకప్ చేసుకున్నవాళ్ళని మనోడు పట్టించుకున్న పాపాన పోలేదట.
ఈ క్రమంలోనే ఎలోన్ మస్క్ మాజీ ప్రేయసి జెన్నిఫర్ గ్వైన్ తన కొడుకు ట్యూషన్ ఫీజు కోసం డబ్బును సేకరించడానికి ‘ఎలన్ మస్క్’నే వాడుకుంది.

విషయంలోకి వెళితే, 1990లో ఎలన్ మస్క్ తో ప్రేమాయణం చేసిన సమయంలో దిగిన ఫోటోలు బహుమతులు మరియు పుట్టినరోజు కార్డులను వేలం వేయాలని ఆ మాజీ ప్రియురాలు జెన్నిఫర్ నిర్ణయించింది.ఇక మస్క్ – అతని మాజీ ప్రియురాలు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో కలిసి విద్యాభ్యాసం చేసారు.కాగా ఆమె ప్రస్తుతం సౌత్ కరోలినాలో తన కొడుకుతో ఒంటరిగా నివసిస్తోంది.
తన కొడుకు కాలేజీ ఫీజు కోసం ఎలన్ మస్క్ తో చేసిన సహజీవనం ఫొటోలను వేలం ద్వారా విక్రయించి సొమ్ము చేసుకోవాలని యోచిస్తోంది.

ఈ సందర్భంగా ఆమె ఎలెన్ గురించి ఇలా రాసుకొచ్చింది.ఎలోన్ సాధారణంగా చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు.కానీ అప్పుడప్పుడు అతను చాలా వెర్రివాడిగా ప్రవర్తిస్తాడు.
నేను అతనితో పాటు నవ్వాలని కోరుకున్నారు.కాబట్టి అతను నిజంగా నవ్వుతూ దిగిన ఈ ఫొటోను షేర్ చేయాలని నిర్ణయించుకున్నాను… అంటూ తమ ఇద్దరి పాత ఫొటోను పంచుకుంది.1994-95 విద్యాసంవత్సరం సెమిస్టర్ చివరలో ఇద్దరూ ఒకరితో ఒకరు డేటింగ్ చేసుకున్నారు.యూనివర్సిటీ క్వాడ్రాంగిల్ డార్మ్లోని ‘స్ప్రూస్ స్ట్రీట్‘ భాగంలో రెసిడెంట్ అడ్వైజర్లుగా వీరిద్దరూ గతంలో కలిసి పనిచేశారు.








