ఏంటి కోపమొస్తుందా? ఈరోజుల్లో ఒక భార్యని మెంటైన్ చేయడమే కష్టం.అలాంటిది ఆ ప్రబుద్దుడు మాత్రం ఏకంగా 15మంది భార్యలా? అని నోళ్లెళ్లబెడుతున్నారు కదూ? కానీ మీరు విన్నది అక్షరాలా నిజం.అంతేకాదు 107మంది పిల్లలు కూడా ఉన్నారట.ఇక అది చాలదన్నట్టు ఇంకో 20 మందిని పెళ్లాడతాడట.ఇంకా అంతమందితోను అతగాడు దర్జాగా బతకడం కొసమెరుపు.వివరాల్లోకి వెళితే, కెన్యాకు చెందిన డేవిడ్ సకయో కలుహనకి ఏకంగా 15మంది భార్యలు.
అయితే ఈ 15మంది ఎంచక్కా ఒకరికొకరు ప్రేమాభిమానాలు పంచుకుంటూ సంసారాన్ని నెట్టుకురావడం గమనార్హం.
ఇతడిడి పశ్చిమ కెన్యాలోని ఓ కుగ్రామం.
ప్రస్తుతం ఆయన వయసు 61 ఏళ్లు. ఆఫ్రికా ప్రాంతంలోని ఒకప్పటి చక్రవర్తి కింగ్ సోలోమన్ స్ఫూర్తితో.
ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవాలన్నది ఆయన కల అంట.కింగ్ సోలోమన్ ఏకంగా 700 మందిని పెళ్లి చేసుకున్నాడన్నది అక్కడి పురాణ గాథల్లో ఉంది.ఈ క్రమంలోనే డేవిడ్ సకయో ఒకరి తర్వాత ఒకరిగా 15 మందిని పెళ్లి చేసుకున్నాడు.వారి ద్వారా ఆయనకు 107 మంది పిల్లలు కూడా కలిగారు.ఇంత మంది ఉన్నా అంతా ఒకే చోట కలిసే ఉంటామని, భార్యల మధ్య ఎప్పుడూ గొడవలు రావని.ఉన్నదేదో అంతా పంచుకుని జీవిస్తారని డేవిడ్ సకయో చెప్పడం విశేషం.

విషయం ఏమిటంటే, నన్ను ఒక మహిళ భరించడం, అర్థం చేసుకోవడం చాలా కష్టం.అందుకే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నాను అని చవాకులు పేలుస్తున్నాడు.ఇప్పటికి 15 మందిని పెళ్లాడాను, ఇంకో 20 మంది అయినా నాకేం సమస్య లేదు.అని డేవిడ్ సకయో జంకూ బెంకూ లేకుండా చెబుతున్నాడు.ఇక వారంతా మా ఆయన మరికొందరు మహిళలను పెళ్లిచేసుకుని తెచ్చుకున్నందుకు నాకేమీ ఇబ్బందిగా లేదు.అతను బాధ్యతాయుతమైన వ్యక్తి.
ఆయన ఏం చేసినా సరిగానే చేస్తారు.ఆలోచించి చేస్తారు… అని డేవిడ్ ను 1998లో పెళ్లి చేసుకున్న జెస్సికా అంటోంది.







