చిత్ర పరిశ్రమకు అందించే అవార్డులలో సైమా పురస్కారాలు ఒకటి.2021 సంవత్సరానికి సంబంధించిన సైమా అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని బెంగుళూరులో నిర్వహించారు.ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు సైమా కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమానికి తెలుగు సెలబ్రిటీలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, పూజా హెగ్డే నవీన్ పోలిశెట్టి వంటి తదితరులు పాల్గొన్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కూడా హాజరైన విషయం మనకు తెలిసిందే.ఈ సైమా అవార్డుల కార్యక్రమంలో భాగంగా ఈయన ఈ కార్యక్రమంలో సందడి చేయడమే కాకుండా 2021 మోస్ట్ హిందీ పాపులర్ యాక్టర్ గా రణవీర్ సింగ్ అవార్డును అందుకున్నారు.
ఇక ఈయన ఈ వేదికపై అవార్డు తీసుకున్న అనంతరం పెద్ద ఎత్తున అభిమానులు ఈయనని చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

ఇలా అభిమానులందరూ ఒక్కసారిగా చుట్టుముట్టడంతో తన బాడీగార్డ్స్ అభిమానుల నుంచి హీరోని కాపాడే ప్రయత్నం చేస్తున్న సమయంలో పొరపాటున బాడీగార్డ్ చెయ్యి హీరో చెంపకు తగిలింది.ఇలా ఒక్కసారిగా బాడీగార్డ్ చెయ్యి హీరో చెంపకు తగలడంతో చాలామంది ఆశ్చర్యపోయారు.హీరో సైతం చెంపకు చేయి పెట్టుకొని షాక్ అవ్వగా అనంతరం పొరపాటుగా తగిలిందని తెలుసుకొని యధావిధిగా అభిమానులతో కలిసి నవ్వుతూ సెల్ఫీలకు ఫోజులిచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.







