టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన ముత్యాల సుబ్బయ్య గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ముత్యాల సుబ్బయ్య ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు విజయం సాధించాయి.
తన డైరెక్షన్ స్కిల్స్ తో సాధారణ కథ, కథనాలు ఉన్న సినిమాను సైతం హిట్ చేయడం ఈ దర్శకుని ప్రతిభకు నిదర్శనం అని చెప్పవచ్చు.
తాజాగా అలీతో సరదాగా ప్రోమో రిలీజ్ కాగా ఈ షోకు ముత్యాల సుబ్బయ్య గెస్ట్ గా హాజరయ్యారు.
అయితే ముత్యాల సుబ్బయ్య కొన్ని వివాదాస్పద అంశాల గురించి సైతం స్పందించడంతో ఆయన గురించి జోరుగా చర్చ జరుగుతోంది.ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ మూడుముళ్ల బంధం అనే సినిమాకు మొదట యాక్షన్ అని చెప్పానని తెలిపారు.
అప్పటికే నేను మూడుముళ్లు వేసేశానని అది సక్సెస్ కాదని ముత్యాల సుబ్బయ్య సరదాగా అన్నారు.
అది పెద్ద ఫ్లాప్ అని ముత్యాల సుబ్బయ్య పేర్కొన్నారు.
ఎడిటర్ మోహన్ గారు మలయాళంలో తెరకెక్కిన సినిమాను చూసి హిట్లర్ సినిమాకు డైరెక్షన్ చేసే ఆఫర్ ఇచ్చారని ఆయన అన్నారు.రాజశేఖర్ తో ఎక్కువగా హిట్ సినిమాలు చేశానని రాజశేఖర్ తో తీసిన తొలి సినిమా అరుణ కిరణం అని ఆయన చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత అన్న, మనసున్న మారాజు, సూర్యుడు సినిమాలను రాజశేఖర్ తో తెరకెక్కించానని ఆయన తెలిపారు.ఒక రకంగా రాజశేఖర్ తో నేనే ఎక్కువగా హిట్లు తీశానని ఆయన చెప్పుకొచ్చారు.

ఇంద్రజను ఒక సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేయడం బాధ పెట్టిందని ఆ పాత్రకు సౌందర్య అయితే బాగుండేదని ఆయన వెల్లడించారు.బోయపాటి శ్రీను నా శిష్యుడని ఆయన తెలిపారు.రాజశేఖర్ గారి మా అన్నయ్య సినిమాకు నన్ను డైరెక్టర్ గా పెట్టారని నెల రోజుల తర్వాత నన్ను మానుకోండని రాజశేఖర్ చెప్పారని ఆయన అన్నారు.రాజశేఖర్ తనను అవమానించారనే విషయాన్ని ముత్యాల సుబ్బయ్య పరోక్షంగా చెప్పుకొచ్చారు.







