దాదాపు రెండు దశాబ్ధాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ తమన్నా ఇప్పటికీ అదే క్రేజ్ ని కొనసాగిస్తుంది.అమ్మడు చేస్తున్న సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.
సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరితో కలిసి నటిస్తూ వస్తున్న తమన్నా తన క్రేజ్ ని మాత్రం కాపాడుకుంటూ వస్తుంది.ఈమధ్య హీరోయిన్స్ సినిమాల్లోనే కాకుండా ఫ్యాషన్ షోస్ తో సోషల్ మీడియాలో కూడా అలరిస్తున్నారు.
లేటెస్ట్ గా ట్రెండీ వేర్ తో తమన్నా కూడా ఆకట్టుకుంటుంది.
బ్లూ కలర్ స్కిన్ ఫిట్ డ్రెస్ తో తమన్నా తన లుక్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది.
ఈ డ్రెస్ లో ఆమె ఈమధ్యనే ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోయిన్ లా మెరిసిపోతుంది.కొత్తగా వస్తున్న హీరోయిన్స్ తో ఫుల్ కాంపిటీషన్ వస్తున్నా సరే తన టాలెంట్ తో ఛాన్సులు అందుకుంటుంది తమన్నా.
ప్రస్తుతం ఆమె రెండు సినిమాల్లో నటిస్తుంది.అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి సినిమా అవడం విశేషం.
మరి చూస్తుంటే తమన్నా మరో ఐదారేళ్లు ఇదే రేంజ్ లో ఫాం కొనసాగించేలా ఉంది. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లో కూడా తమన్నా తన సత్తా చాటుతుండగా ఎలాంటి ఆఫర్ వచ్చినా సరే తాను రెడీ అంటుంది.







