సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశ పెట్టిన సంకల్ప్ స్కీం ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభం...

ఖమ్మం : స్వయం ఉపాధిలో ఆసక్తి కలిగి సొంతంగా ఎదగాలని లక్ష్యంతో ఉన్నవారి కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశ పెట్టిన సంకల్ప్ స్కీం ద్వారా నీస్బడ్ మరియు వార్స్ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణా తరగతులను సోమవారం ప్రారంభించారు .పదోవ తరగతి ఆపైన చదువుకున్న 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు .

 Free Training Classes Begin , Free Training Classes , Khammam,self Employed,sank-TeluguStop.com

సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకునే వారికోసం 15రోజుల (రోజుకి 2 గంటలు) పాటు వ్యాపారంలో మెల్కువాలు , నైపుణ్యాలు మరియు వ్యాపారానికి సంబంధించిన బ్యాంక్ వారి సబ్సిడీ రుణాలపై అవగాహన మరియు పలు అంశాలపై ఉచితంగా శిక్షణ తరగతులను ఇచ్చి శిక్షణ తరగతులు పూర్తిచేసుకున్న వారికి ఆఖరి రోజు సర్ట్ఫికెట్లు అందజేస్తారని తెలిపారు .ఆసక్తిగల అభ్యర్థులు ఆధార్ కార్డు జిరాక్స్ , రెండు పాస్ ఫోటోలు , సర్టిఫికెట్లతో నేరుగా జడ్పీ సెంటర్ హోటల్ గ్రాండ్ గాయత్రి , గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా గణేష్ ప్లైవుడ్ షాప్ పైన సెకండ్ ఫ్లోర్ కు రాగలరు అన్ని పేర్కొన్నారు .మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నెంబర్ను 9010525740 సంప్రదించగలరని కోరారు .ఈరోజు మొదలైన శిక్షణా తరగతుల్లో నిర్వాహకులు నీస్బడ్ ఢిల్లీ నుండి పూజా , ఏ.పి.పి.సి ప్రతినిధులు ఖాజా మద్దిన్ , తిరుపతి , వార్స్ స్వచ్ఛంధ సంస్థ డైరెక్టర్ శిల్ప , సురేష్ , రామ్ , రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube