సినిమా కోసం పులితో స్నేహం చేసిన కృష్ణం రాజు

కృష్ణం రాజు మరణ వార్త విని టాలీవుడ్ పరిశ్రమ దుఃఖం తో తల్లడిల్లుతోంది.ఇది పరిశ్రమకు తీరని లోటు అని ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Friendship Between Krishnam Raju And Tiger Details, Krishnam Raju, Tiger, Kataka-TeluguStop.com

ప్రస్తుతం ఎక్కడ చుసిన అయన గురించిన వార్తలే వైరల్ అవుతున్నాయి.కృష్ణం రాజు కి సంబందించిన అనేక విషయాలు సైతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

కృష్ణం రాజు పేరుకు తగ్గట్టే రాజుల కుటుంబంలోనే జన్మించాడు.బ్రతికినంత కాలం రాజులాగానే బ్రతికాడు.

యుక్త వయసులో కృష్ణం రాజు నిత్యం వేటకు సైత్మ వెళ్లేవాడట.అడవుల్లో కూడా నిత్యం తిరిగేవారట.

ఆలా ఓ సారి పులి నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకొని బయటపడ్డాడు.

ఈ విషయం కృష్ణం రాజు తన భార్య శ్యామల దేవి తో కలిసి ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించటం జరిగింది.

అయన మాటల్లో పులి చాలా పిరికిది.ఎవరైనా తనకు హాని చేస్తారు అనుకుంటేనే అటాక్ చేస్తుందట.అలాగే పులి తో తాను చేసిన స్నేహం గురించి కూడా సరదాగా ప్రేక్షకులతో పంచుకున్నారు కృష్ణం రాజు.కటకటాల రుద్రయ్య సినిమా కోసం ఒక పులిని అద్దెకు తీసుకోచ్చారట.

ఈ చిత్రంలో కృష్ణం రాజు పులి తో ఫైట్ చేసే ఒక సీన్ ఉండటం తో దానిని తెప్పించారట.

Telugu Krishnam Raju, Krishnamraju, Tiger, Tollywood-Movie

అయితే పులి మెడ పై మొదటి సారి కృష్ణం రాజు చేయి వెయ్యడం తోనే విసిరికొట్టింది.దాంతో చాలా దూరం లో ఎగిరిపడ్డారట.ఆ తర్వాత మెల్లిగా తనను మచ్చిక చేసుకోవడం కోసం అలా నిమురుతూ దగ్గరయ్యారట.

ఆలా కొంచం టైం తీసుకున్నాక ఫ్రెండ్ గా కూడా మారిపోయిందట ఆ పులి.మళ్ళి ఏడాది తర్వాత ఆ పులిని మరోమారు షూటింగ్ కి తీసుకు రావడం తో కృష్ణం రాజు ని గుర్తు పట్టి తన దగ్గరికి వచ్చిందట.

ఆలా సినిమా షూటింగ్ కోసం మొదలై ఆ తర్వాత స్నేహితులుగా మారిపోయారట పులి మరియు కృష్ణం రాజు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube