వైరల్ వీడియో: అబ్బో.. చిరుత పులిలా బిల్డప్ ఇచ్చిన పిల్లి.. చివరికి తస్సుమంది..

పక్షులను పిల్లలు వేటాడే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పిల్లి తన టెన్నిక్ తో పక్షలపై పట్టుకోవడానికి ప్రయత్నించడం.

 Viral Video Wow The Cat Who Gave Like A Leopard , Lion , Cat , Viral Latest , Ne-TeluguStop.com

ఆ పక్షి తెలివిగా తప్పించుకోవడం చూస్తుంటాం.అలాంటి వీడియోలు చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంటాయి.

తాజాగా అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో పిల్లి చేసిన పని నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది.

సాధారణంగా వేటాడేటప్పుడు జంతువులు ఏంచేస్తాయి? ముందు మాటు వేసి.ఆ తర్వాత అదును చూసి దాడి చేస్తాయి.

అడవి జంతువులైన సింహం, పులి ఎంతో తెలివిగా వేటాడుతాయి.పిల్లి కూడా అదే జాతికి చెందిన జంతువు కదా.వాటికి కూడా అవే పోలికలు ఉంటాయి.పులి, సింహం ఎలా వేటాడుతాయో.

అలానే పిల్లి కూడా వేటాడుతుంది.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ పక్షి గింజలు తింటుంది.ఇది గమనించిన పిల్లి ఆ పక్షిని ఎలాగైనా ఆహారంగా చేసుకోవాలనుకుంది.అంతే.

ఆ పక్షిని వేటాడేందుకు సిద్ధమైంది.అందుకోసం ఆ పిల్లి ఓ గోడ చాటున మాటు వేసింది.

గింజలు తింటున్న ఆ పక్షి మీద దాడి చేసేందుకు రెడీ అయ్యింది.ఆ పక్షి కూడా గింజలు తింటూ అటూ ఇటూ తిరుగుతుంది.

అయితే ఆ పిల్లి మాత్రం సమయం కోసం, అదును కోసం ఎదురుచూస్తోంది.ఇంతలో ఆ పక్షి ఉన్నట్లుండి మాటువేసిన పక్షి వద్దకు వచ్చింది.

అంతే పిల్లి ఒక్కసారిగా బిత్తరపోయింది.మొదట్లో పిల్లి ఆ పక్షిని పట్టుకుంటుందనుకున్నారు.

కానీ చివరికి తుస్సుమంది.ఆ పక్షిని చూసి పిల్లి అక్కడి నుంచి జారుకుంది.

ఈ దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది.దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

చిరుత పులిలా బిల్డప్ ఇచ్చి చివరికి తుస్సుమందని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube