మాస్ మహారాజా కెరీర్ ఎప్పుడు జెట్ స్పీడ్ తోనే దూసుకు పోతాడు.ఏడాదికి మూడు నాలుగు సినిమాలను పక్కాగా విడుదల చేస్తాడు.
ఈయన గ్యాప్ లేకుండా సినిమాలు అనౌన్స్ చేసి అంతే వేగంగా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు.ఇటీవలే రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ఖిలాడీ, శరత్ మండవ దర్శకత్వంలో చేసిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ప్లాప్ అయ్యాయి.
అయినా కూడా మాస్ రాజా జోరు ఏ మాత్రం తగ్గకుండా మరింత వేగం అయ్యింది.ప్రెజెంట్ రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రవితేజ కు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా.వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అలాగే రావణాసుర సినిమా కూడా సెట్స్ మీదనే ఉంది.సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇంకా రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా వేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా నిర్మిస్తున్నారు.

ఇన్ని సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరికొన్ని సినిమాలకు ఓకే చెప్పినట్టు టాక్ వస్తుంది.తీరిక సమయంలో కథలు వింటూ తనకు నచ్చిన స్టోరీని లాక్ చేస్తూ పోతున్నాడు.ఇక తాజాగా సినిమాటోగ్రాఫర్ ఘట్టమనేని కార్తీక్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పారట.
అలాగే సంపత్ నంది చెప్పిన కథ కూడా ఓకే చేసారని టాక్ బలంగా వినిపిస్తుంది.
వీరి కాంబోలో ఇంతకు ముందు బెంగాల్ టైగర్ రాగా అది ప్లాప్ అయ్యింది.అయినా కూడా ఈయనకు మరోసారి అవకాశం ఇచ్చాడు.సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తి కాగానే ఈ సినిమాలను పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాడట.







