తుంగభద్ర జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో అప్రమత్తమైన అధికారులు డ్యామ్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 38,567 క్యూసెక్కులు కాగా, ఔట్ఫ్లో 32,402 క్యూసెక్కులుగా ఉంది.డ్యాం పూర్తి నీటిమట్టం 1633 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 1632.65 అడుగులుగా ఉంది.ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 105.788 టీఎంసీలుగా కాగా, ప్రస్తుత నీటినిల్వ 104.383 టీఎంసీలుగా కొనసాగుతుంది.







