శర్వానంద్ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా రూపొందిన ఒకే ఒక జీవితం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అమల అక్కినేని కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శి నటించారు.
ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం తో మంచి వసూళ్లు నమోదవుతున్నాయి.మొదటి రోజు కోటిన్నర వరకు షేర్ దక్కించుకున్న ఈ సినిమా రెండవ రోజు అయిన శని వారం మరియు మూడవ రోజు అయిన ఆది వారం కూడా భారీ మొత్తంలో వసూళ్లను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాకు పోటీ అన్నట్లుగా విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమా కూడా పరవాలేదు అన్నట్లుగానే ఓపెనింగ్స్ దక్కించుకుంది.కానీ శని, ఆదివారాల్లో ఆ సినిమా ను ఒకే ఒక జీవితం డామినేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అక్కినేని అమల కీలక పాత్రలో నటించడం వల్ల అందరూ కూడా సినిమా పై ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.సినిమాకు ఒక మోస్తరు ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.అందుకే మొదటి రోజు భారీ ఎత్తున వసూళ్లని సొంతం చేసుకోలేక పోయింది.కానీ సినిమా విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ రావడంతో పబ్లిసిటీ కార్యక్రమాలకు స్పీడ్ పెంచారు.
దాంతో శని ఆదివారాల్లో భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతాయంటూ సినీ వర్గాల వారు మరియు బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శర్వానంద్ కు చాలా కాలం తర్వాత ఈ సినిమాతో సక్సెస్ దక్కింది అంటూ ఆయన అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వీకెండ్ రోజుల్లో సినిమా మంచి వసూళ్లను సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అయినట్లే అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.శర్వానంద్ గత సినిమాల అనుభవం నేపథ్యంలో తక్కువ బడ్జెట్ తో రూపొందించి.
లిమిటెడ్ గా విడుదల చేశారు.దాంతో ఇప్పుడు సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేందుకు స్క్రీన్స్ పెంచుతున్నట్లుగా సమాచారం అందుతుంది.







