సినీ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు ఇచ్చింది.లైకా ప్రొడక్షన్స్ కు రూ.21.29 కోట్ల అప్పు చెల్లింపుల కేసులో ఆయనకు రెండు వారాల గడువు ఇచ్చింది.ఆస్తుల వివరాలతో కూడిన సరైన పత్రాలు సమర్పించాలని ఆదేశించింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.అయితే, తన చిత్ర నిర్మాణ సంస్థ ఒకే రోజు రూ.18 కోట్లు నష్టపోవడంతో లైకా సంస్థకు అప్పు చెల్లించలేకపోయానని విశాల్ న్యాయస్థానానికి తెలిపిన విషయం తెలిసిందే.







