సాధారణంగా జనావాసాల్లో కట్ల పాములు, నాగుపాములు, త్రాచు పాములు, జరిగొడ్డు వంటి పాములు నివసిస్తుంటాయి.ఒక్కోసారి అడవిలో ఉండాల్సిన అనకొండ, కొండచిలువలు కూడా ఇళ్లల్లోకి ప్రవేశిస్తాయి.
ఇవి చాలా పెద్దగా ఉండి ప్రజల ప్రాణాలను కూడా తీసేస్తాయి.ముఖ్యంగా దూడలు, కుక్కలు, గొర్రెలు, మేకలపై ఇవి దాడిచేసి తినేస్తాయి.
అయితే తాజాగా ఒక కొండచిలువ రెండు పిల్లులను తినేందుకు ఒక ఇంటిలోని బాత్‌రూమ్‌లోకి దూరింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియో ప్రకారం, ఒక భారీ కొండచిలువ బాత్రూంలోకి వచ్చి ఇంటి యజమానులు పెంచుకుంటున్న పిల్లులను చంపాలనుకుంది.కానీ పిల్లులకు, ఆ కొండచిలువకి మధ్య గ్లాస్ ఉండటంతో అది వీటిపై దాడి చేయలేక పోయింది.
వివరాల్లోకి వెళితే.బుధవారం నాడు బ్యాంకాక్‌లోని ఓ ఇంటిలోకి ఒక చిన్న కన్నం ద్వారా కొండచిలువ ప్రవేశించింది.దాదాపు 12 అడుగుల పొడవుతో ఇది చాలా పెద్దదిగా ఉంది.అయితే అది దూరిన కన్నం నేరుగా బాత్రూమ్‌లోకి దారి తీసింది.
వాష్ రూమ్ లోకి వెళ్ళిన ఆ పాము నీళ్ల టబ్‌లోకి దూకింది.ఆ తర్వాత తనకి ఒక అడుగు దూరంలోనే కనిపిస్తున్న పిల్లి పిల్లలను మింగుదామని ప్రయత్నించింది.
కానీ మధ్యలో గ్లాస్ ఉండటంతో పిల్లి పిల్లలు బతికిపోయాయి.
పిల్లులు బాత్ రూమ్‌లోకి వెళ్ళి ఒక రకంగా చూస్తుంటే ఆ ఇంటి యజమాని పిల్లలు గమనించారు.
ఆపై ఏంటా అని లోపలికి వెళ్లి చూడగా వారికి ఒక పెద్ద పాము కనిపించింది.దాంతో కేకలు వేస్తూ తల్లిదండ్రులు పిలవగా వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
వెంటనే ఆ ఇంటికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది దానిని చాలా జాగ్రత్తగా పట్టుకొని సంచిలో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ పాము చిన్నారులను గమనించకుంటే తమ పెంపుడు పిల్లులను అది ఇప్పటికే ఆరగించి ఉండేదని యజమానులు చెప్పుకొచ్చారు.
అయితే ఈ ఇంటికి సమీపంలోనే పెద్ద అటవీ ప్రాంతం ఉంది.అందుకే ఇక్కడికి తరచుగా వస్తుంటాయి.కానీ కొండచిలువ రావడం ఇదే మొదటిసారి అని యజమానులు చెబుతున్నారు.ఆహారం అయ్యుండేవని ఇంటి యజమాని తెలిపాడు.
ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.







