బాహుబలి మొదటి పార్ట్ సినిమా సక్సెస్ అవ్వడం తో అంతకు మించి అంటూ దర్శకుడు రాజమౌళి బాహుబలి 2 సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెలిసింది.ఆ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అలాగే కేజిఎఫ్ విషయంలో కూడా అదే జరిగింది.ఇప్పుడు పుష్ప సినిమా కి కూడా అదే జరగబోతుంది.
అల్లు అర్జున్ సినిమా లో పుష్ప సినిమా హిట్ అవ్వడంతో రెండవ పుష్ప ని తీసుకు వచ్చేందుకు భారీ ఎత్తున కసరత్తులు నిర్వహిస్తున్నారు.ఒక సినిమా సక్సెస్ అయితే దాని యొక్క సీక్వెల్ తీసుకు రావడంలో ఉత్సాహం ఉంటుంది.
ఆ ఉత్సాహం తో మంచి సినిమా ను తీసుకు వచ్చి మళ్ళీ విజయాన్ని సొంతం చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం.కానీ బ్రహ్మాస్త్ర సినిమా విడుదల తర్వాత ఈ పార్ట్ 2 ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొదటి నుండే ఈ సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఇప్పుడు మొదటి భాగం మరీ దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది.
కనుక రెండవ భాగం పై నీలి నీడలు కమ్ముకున్నాయి.ఇప్పటికే రెండవ పార్ట్ యొక్క షూటింగ్ పూర్తి చేశాం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
ఆయినా కూడా విడుదలకు ప్రేక్షకులు మరియు ఇతర వర్గాలకు సంబంధించిన వారు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.ఆ సినిమా ను విడుదల చేసి మళ్లీ పరువు తీసుకోవడం తప్పే మారేం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే ఇప్పటికే షూటింగ్ పూర్తి అయ్యింది కనుక పెద్దగా ఖర్చు లేకుండా ప్రేక్షకుల ముందుకు సాధారణం గా తీసుకు వస్తే పోయేదేముంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి కరణ్ జోహార్ అండ్ టీం ఏం నిర్ణయించుకుంటారో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.







