భారీ అంచనాల నడుమ తెరకెక్కి నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్ర తీవ్రంగా నిరాశ పరిచింది.400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమా ని ప్రేక్షకులు తిరస్కరించారు.మొదటి నుండే బాయికాట్ బ్రహ్మాస్త్ర అంటూ కొందరు సినిమా కు వ్యతిరేకం గా ప్రచారం చేశారు.అది చాలదన్నట్టు ఇప్పుడు సినిమా ఫలితం బెడిసి కొట్టింది.దాంతో వసూళ్లు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.ఇలాంటి పరిస్థితి కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చడ్డ కి వచ్చింది.
ఆ సినిమా యొక్క వసూళ్లు అమీర్ ఖాన్ వల్ల కాస్త పరవాలేదు అనిపించినా దారుణమైన పరాజయాన్ని ఆ సినిమా మూట కట్టుకుంది.
ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా బ్రహ్మాస్త్ర సినిమా కూడా నష్టాలను మూట కట్టుకోబోతున్నట్లుగా తెలుస్తుంది.బాలీవుడ్ వర్గాల నుండి మరియు మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం బ్రహ్మాస్త్ర సినిమా రూ.400 కోట్లలో కనీసం 50 కోట్లు కలెక్షన్స్ ద్వారా మరో 50 కోట్లు ఇతర రైట్స్ ద్వారా రాబట్టే పరిస్థితి లేదని ఊహిస్తున్నారు.బాలీవుడ్ లో సినీ విశ్లేషకులు మరియు బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్న దాని ప్రకారం బ్రహ్మాస్త్ర సినిమా కి నష్టం దాదాపుగా రూ.300 కోట్లకు పైగానే ఉంటుంది అని అంటున్నారు.ఒక ఇండియన్ సినిమా కి భారీ నష్టం ఇదే.ఇప్పటి వరకు ఈ స్థాయి లో ఏ సినిమా కూడా నష్ట పోలేదు అనేది టాక్.మొత్తానికి నష్టం లో కూడా బ్రహ్మాస్త్ర రికార్డ్ సృష్టించడం విడ్డూరం.తెలుగు లో రాజమౌళి సమర్పించినా కూడా ఇక్కడి నుంచి కనీసం వసూళ్ల ను రాబట్టిన పరిస్థితి లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







