టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా అదే రీతిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు చిరంజీవి.
అయితే కేవలం రీ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతోమందికి సహాయం చేసి హీరో అనిపించుకున్న వ్యక్తి చిరు.చిరంజీవి తన అభిమానులకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా వెంటనే స్పందిస్తూ ఉంటాడు.
ఇప్పటికే ఎంతోమంది అభిమానులకు ప్రాణదానం చేసిన విషయం తెలిసిందే.తాజాగా చిరంజీవి తన అభిమానికి ఏకంగా లేఖ రాసి భరోసా ఇచ్చారు.
క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమానికి భరోసా నింపడం కోసం లేఖ రాయడంతో పాటుగా అందులో ఐదు లక్షల రూపాయల చెక్కును కూడా పంపించారు చిరు.అంతేకాకుండా సదరు అభిమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాను అని లేఖలు చెప్పకు వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన చక్రధరరావు అనే అభిమానికు చిరంజీవి అండగా నిలిచారు.అనారోగ్యంతో ఉన్న విషయాన్ని తెలుసుకున్న చిరు హైదరాబాదుకు పిలిపించి మరి మెరువైన వైద్యాన్ని అందించారు.
అలాగే ఆసుపత్రికి వెళ్లి మరి పరామర్శించారు.అంతేకాకుండా సదరు అభిమాని క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ లేఖ కూడా రాశారు మెగాస్టార్.
ఈ సందర్భంగా లేఖలో ఈ విధంగా రాసుకొచ్చారు.మీరు నా పేరు మీద ప్రజలకు చేసిన సేవలు వర్ణనాతీతం.

అవన్నీ చూసి నేను చాలా ఆనందపడ్డాను.కానీ అనారోగ్యంగా ఉన్నారని తెలిసి మరింత బాధపడ్డాను.త్వరలోనే మీరు కోలుకొని ఎప్పటిలాగే ప్రజా సేవలో నిమగ్నం అవుతారని ఆశిస్తున్నాను.అంతేకాకుండా ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటానని, ప్రస్తుతానికి సర్జరీ కోసం మెరుగైన వైద్యం కోసం ఐదు లక్షల రూపాయలు చెక్కును పంపిస్తున్నాను.
మరొకసారి మీకు నా అభినందనలు.ఎన్నో కార్యక్రమాలను ఆదర్శంగా ఉన్నారు.త్వరలోనే వీలైనంత త్వరగా మీరు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను మీ కుటుంబ సభ్యులకు నా నమస్కారములు అని రాసుకొచ్చారు చిరు.







