పూరీ జగన్నాథ్ ఛార్మి నిర్మాతలుగా పలు సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే.కథల ఎంపికలో జరిగిన పొరపాట్లు, పూరీ జగన్నాథ్ డైరెక్షన్ విషయంలో చేసిన పొరపాట్లు సినిమాల ఫ్లాప్ కు కారణమయ్యాయి.
పూరీ జగన్నాథ్, ఛార్మి నిర్మాతలుగా తెరకెక్కిన లైగర్ సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.
అయితే పూరీ జగన్నాథ్ ఛార్మి బంధం బ్రేక్ అయితే మాత్రమే పూరీ జగన్నాథ్ ఆఫర్లు ఇస్తామని ఒక నిర్మాత పూరీ జగన్నాథ్ కు ఆఫర్ ఇచ్చారని బోగట్టా.
ఆ విధంగా చేస్తే చిరంజీవి లేదా బాలయ్యతో సినిమా చేసే అవకాశం ఇస్తానని ఆయన చెప్పినట్టు సమాచారం అందుతోంది.అయితే ఇదే సమయంలో ఛార్మి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.
అయితే సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటన చేసిన ఛార్మి తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.

వైరల్ అవుతున్న రూమర్లు అన్నీ ఫేక్ అని పూరీ కనెక్ట్స్ పై ప్రస్తుతం దృష్టి పెట్టానని ఆమె చెప్పుకొచ్చారు.అదే సమయంలో రెస్ట్ ఇన్ పీస్ రూమర్స్ అంటూ ఛార్మి కామెంట్లు చేశారు.వైరల్ అవుతున్న రూమర్లలో ఏ మాత్రం నిజం లేదని ఛార్మి తన పోస్ట్ ద్వారా చెప్పేశారు.

అయితే అతి త్వరలో పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి పని చేస్తారో లేదో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి పని చేయడం ఇండస్ట్రీలో చాలామందికి ఇష్టం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే ఎందుకు ఇష్టం లేదనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.







