జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.ఆయన మంత్రి పదవి చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జర్నలిస్టు యూనియన్ నాయకులు ఆయనను గురువారం ఆయన నివాస గృహాంలో కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వర్కింగ్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టెకోల రామనారాయణ మాట్లాడుతూ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ విజయవంతంగా మూడేళ్ల పాటు తన మంత్రి పదవిని నిర్వహించారని అన్నారు.సమర్థవంతమైన మంత్రిగా ప్రజలు మన్ననలు పొందుతున్నారని ప్రజలకు మరింత సేవలు అందించి ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని యూనియన్ నాయకులతో కలిసి రాం నారాయణ మంత్రిని కోరారు.
కోవిడ్ సమయంలో మంత్రి అజయ్ కుమార్ కోవిడ్ బారిన పడిన జర్నలిస్టుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపారని ఇటీవల తాను అస్వస్థకు గురైన సందర్భంలో కూడా మంత్రి ఎంతో గొప్పగా స్పందించారని రామ్ నారాయణ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
మంత్రి స్పందిస్తూ తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని రామ్ నారాయణతో పాటు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తినప్పుడు జర్నలిస్టులు అందరికీ అండగా ఉంటామని అన్నారు.అనారోగ్యం నుంచి త్వరగా కోలుకున్న రామ్ నారాయణ ను మంత్రి అభినందించారు ఆయన చలోక్తిగా మాట్లాడుతూ మీరు జర్నలిస్టు నాయకులు మా అందరికీ వినాయకు లు అంటూ నవ్వుతూ శుభాకాంక్షలు తెలిపారు.
ఇండ్ల స్థలాల విషయంపై స్పందిస్తూ ఇదివరకు సుప్రీంకోర్టులో ఇళ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించి క్లియరెన్స్ రావాల్సి ఉండడం వల్ల పరిష్కరించడంలో ఇబ్బంది కలిగిందని అన్నారు.కాగా ఇటీవల సుప్రీంకోర్టు లిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి అంశంపై క్లియరెన్స్ ఇచ్చినందున ఇక ఆ విషయంలో ముందుకు అడుగులు వేసేందుకు అడ్డంకులు తొలగిపోయాయని ఆయన అన్నారు త్వరలోనే ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, మాజీ జిల్లా అధ్యక్షులు నర్వనేని వెంకటరావు, ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కనకం సైదులు, నగర అధ్యక్ష కార్య దర్సులు మైస పాపారావు , చెరుకు పల్లి శ్రీనివాసరావు ,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాటేటి వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు మొహిద్దిన్, యూనియన్ జిల్లా నాయకులు యోగి నాటి మాధవరావు, శివానంద, జనార్ధనా చారి ,రాంబాబు, సాగర్ వేణుగోపాల్ తో పాటు వినయ్ ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.







